ఆలూరు తాలూకా “మిని మహానాడు” లో తెలుగు తముళ్ల ప్రభంజనం
1 min read
ఆలూరు , న్యూస్ నేడు : ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలూరు తాలూకా ప్రజల అభిమాన నాయకులు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి వర్యులు గౌ.శ్రీ.బి.వీరభధ్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్ నందు ఆలూరు తాలూకా మిని మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా భారీఎత్తున జరిగిందిఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టిడిపి అధ్యక్షులు గౌ.శ్రీ.తిక్కారెడ్డి అలాగే కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ ఎల్లప్పుడూ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.అలాగే జిల్లాస్థాయి మహానాడు కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.అలాగే ఈకార్యక్రమంలోముఖ్యమంత్రి సహాయనిది నుండి వచ్చిన (రూ.4,40,619/-) నగదు చెక్కులను.శ్రీ.వీభద్రగౌడ్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ మార్గంచూపే జాబ్ మేళా క్యాలెండర్ ను కూడా విడుదల చేశారు.ముఖ్యంగా ఈకార్యక్రమంలోఆలూరు టిడిపి యూత్ ఐకాన్ యువనేత .గిరిమల్లేశ్ గౌడ్ తో పాటు నియోజకవర్గ ఆరు మండలాల టిడిపి కన్వీనర్లు, క్లస్టర్,బూత్,యూనిట్ ఇంచార్జీలు,సర్పంచ్ లు, ఎంపీటిసిలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ,వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా మరియు తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అలాగే తెలుగుయువత, ఐటిడిపి , టిఎన్ఎస్ఎఫ్ , టిఎన్టియుసి, టిడిపి శోషల్ మీడియా,మహిళా సంఘాలు అలాగే టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు, కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.