NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరు నెలల్లో ఉగ్రదాడి జ‌ర‌గొచ్చు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆరు నెలల్లో అమెరికా పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దాడికి య‌త్నించే అవ‌కాశం ఉంద‌ని పెంట‌గాన్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు అక్కడి కాంగ్రెస్ కు వివ‌రించారు. అప్ఘాన్ భూభాగం నుంచి అమెరికాకు ముప్పు ఉంద‌ని అక్కడి నిఘావ‌ర్గాలు హెచ్చరించాయి. ఆప్ఘన్ లో 20 ఏళ్ల యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఆ దేశం నుంచి తీవ్రమైన ముప్పు ఉంద‌ని పెంట‌గాన్ అధికారులు తెలిపారు. అమెరిక‌న్ సేన‌లు ఆప్ఘన్ వ‌దిలి వెళ్లగానే తాలిబ‌న్లు ఆప్ఘన్ ను ఆక్రమించారు. అనంత‌రం ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు త‌మ ఉనికిని చాటే ప్రయ‌త్నం చేస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ సంస్థలో వేల మంది ఉగ్రవాదులు ఉన్నార‌ని, అమెరికాపై దాడి చేసే సామ‌ర్థ్యం పెంచుకున్నార‌ని వెల్లడించారు.

About Author