PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జగన్​కు కృతజ్ఞతాభివందనం.. : రాయచోటి ముస్లిం మైనార్జీలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: జగనన్నా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం చేయడం ద్వారా మీరు చేసిన మేలు ఈ జన్మలో మరువలేమన్నా అంటూ రాయచోటి  పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నేతలు పేర్కొన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి హయాం నుండి మాకు అన్నివిధాలుగా అండగా ఉంటూ వస్తున్న వైఎస్ఆర్ కుటుంబం వెన్నంటే ఎల్లవేళలా ఉంటామంటూ తెలిపారు. అన్నమయ్య జిల్లాకు రాయచోటిని కేంద్రంగా ప్రకటించడాన్ని హర్షిస్తూ రాయచోటికి చెందిన ముస్లిం మైనార్టీ నేతలు శుక్రవారం  పట్టణంలో సంఘీభావ, కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని మౌలాని భుక్తియారి చౌక్  ఠాణా  వద్దనుండి నేతాజి సర్కిల్ వరకు సాగింది. నేతాజీ సర్కిల్ లో మానవ హారం ఏర్పాటు చేశారు. ఠాణా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ర్యాలీనుద్దేశించి వైఎస్ఆర్ సిపి  మైనార్జీనేత హబీబుల్లాఖాన్, మతపెద్ద షర్పుద్దీన్ సాహెబ్ లు మాట్లాడుతూ దశాబ్దాలుగా కరువు ప్రాంతంగా ఉన్న రాయచోటిని అభివృద్ధిపథంలో నడిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. పట్టణానికి రింగురోడ్డు, త్రాగునీరు, భూగర్భడ్రైనేజి, గ్రేడ్-1మున్సిపాలిటీగా ఏర్పాటు తదితర అభివృద్ధి పనులన్ని వైఎస్ఆర్ కుటుంబంతో సాధ్యమైనట్లు చెప్పారు. అంతటితో ఆగక అన్నమయ్య జిల్లాకు రాయచోటిని కేంద్రంగా ప్రకటించడం హర్షదాయకం అన్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు రాయచోటి కేంద్రంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి అన్నింటికి అనువుగా ఉందన్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి మరింత అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.రాయచోటిని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి సల్పిన  సీఎం జగన్, ఎంపి మిథున్, చీఫ్ విప్ శ్రీకాంత్ లకు ముంస్లిం మైనారిటీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చెన్నూరు అన్వర్ బాష, మైనార్జీనేతలు హసన్ బాష, మూసా కరీముల్లా, వైఎస్ ఆర్ సిపి నేతలు ఫయాజ్ అహమ్మద్,అల్తాఫ్, ఆసీఫ్ అలీ ఖాన్, గౌసూన్,సున్నా, ఖాదర్ వలీ,  జిల్లాసాధనా సమితి నేతలు ఇర్షాద్,జమాలా బాషతో పెద్దఎత్తున ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.

About Author