NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

` ఆ పెద్ద‌రికం నాకొద్దు.. నాకిష్టం లేదు ` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీలో పెద్ద‌రికం త‌న‌కు వ‌ద్ద‌ని, ఆ ప‌దవి త‌న‌కు ఇష్టం లేద‌ని తేల్చి చెప్పారు. ఒక బాధ్య‌త గ‌ల బిడ్డ‌గా ఉంటాన‌ని, అందరి బాధ్య‌తా తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ముందుకు వ‌స్తాన‌ని, అన‌వ‌స‌ర‌మైన వాటికి మాత్రం రాన‌ని తెలిపారు. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య‌.. యూనియ‌న్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగితే ఆ పంచాయ‌తీ తీర్చ‌మ‌ని త‌న వ‌ద్ద‌కు వ‌స్తే పంచాయ‌తీ చేయ‌న‌ని తేల్చారు. కార్మికుల‌కు ఆరోగ్య‌, ఉపాధి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వారికోసం నిల‌బ‌డ‌తాన‌ని హామీ ఇచ్చారు. హైద‌రాబాద్ లో సినీ కార్మికుల‌కు హెల్త్ కార్డుల పంపిణీ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

                                   

About Author