PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌ల్ల‌గా ఉంద‌ని.. గేదె కూడ ద్రావిడ గేదెనా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యువన్ శంకర రాజా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్రావిడ సిద్ధాంతంపై చర్చకు తెర‌లేపింది. ‘‘నల్ల ద్రావిడుడు, గర్వకారణమైన తమిళుడు’’ అంటూ తన ఫొటోను యువన్ శంకర రాజా పోస్ట్ చేశారు. యువన్ నల్ల రంగు టీ-షర్ట్, లుంగీ ధరించి కనిపిస్తున్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి ‘‘డార్క్ ద్రవిడియన్, ప్రౌడ్ తమిళియన్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అణ్ణామలై స్పందిస్తూ, యువన్ నల్లనివాడైతే, ఓ అడవి కాకి మాదిరిగా ఉన్న తాను అంతకన్నా ఎక్కువ నల్లనివాడినని, తాను కూడా స్వచ్ఛమైన ద్రావిడుడినేనని పేర్కొన్నారు. నామ్ తమిళార్ కట్చి నేత సీమన్ స్పందిస్తూ, ‘‘కేవలం ఓ వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రానికి, ఆ వ్యక్తి ద్రావిడుడని కాదు. తాను నల్లగా ఉన్నాను కాబట్టి తాను ద్రావిడుడినని ఆయన చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్నవారంతా నల్లగానే ఉంటారు. అది వాళ్ళని ద్రావిడులను చేస్తుందా? గేదె కూడా నల్లగానే ఉంటుంది. దాని అర్థం అది కూడా ద్రావిడ గేదె అనేనా?’’ అని ప్రశ్నించారు.

                                

About Author