NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బన్నీ ఉత్సవాలు, స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

1 min read

గొడవలకు దూరంగా ఉండాలి.. కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. 1930కు ఫిర్యాదు చేయాలి: ఎస్సై దిలీప్ కుమార్

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం కొత్తపేట గ్రామంలో రాబోయే దసరా బన్నీ ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హొళగుంద ఎస్సై దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు.దసరా బన్నీ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై దిలీప్ కుమార్ సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. చిన్నపాటి వివాదాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా సంయమనం పాటించాలని సూచించారు.అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావివ్వకుండా పార్టీలకు అతీతంగా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొంటూ గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, అనుమానాస్పద ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.మహిళలపై ఎలాంటి నేరాలకు పాల్పడరాదని, మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదే విధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై దిలీప్ కుమార్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *