NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సులువాయిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

1 min read

సొంత ఖర్చులతో రూ.1.30 లక్షలతో కొత్త మోటార్ ఏర్పాటు

భీమలింగప్ప చౌదరి చొరవపై గ్రామస్థుల అభినందనలు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం సులువాయి గ్రామంలో తాగునీటి సరఫరాకు ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించేందుకు టీడీపీ నాయకులు చొరవ తీసుకున్నారు. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి మేడం ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు భీమలింగప్ప చౌదరి ముందుకు వచ్చారు.గ్రామంలో తాగునీటి సరఫరాకు అవసరమైన కొత్త మోటార్ పంపును తన సొంత ఖర్చులతో రూ.1.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి సమకూర్చారు. దీంతో గ్రామంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు మోటార్ ఏర్పాటు పనులు చేపట్టారుగ్రామ ప్రజల తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి, భారీ మొత్తాన్ని సొంతంగా వెచ్చించి కొత్త మోటార్‌ను సమకూర్చిన భీమలింగప్ప చౌదరి సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు. ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు, వాటర్‌మ్యాన్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.

మోటార్​, టీడీపీ, కార్యకర్తలు,

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *