NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి పల్లెకూ బస్సు సర్వీసు తిరగాలి

1 min read

– ఆర్టిసి డిపో అధికారులను ఆదేశించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: ప్రతిపల్లెకూ ఆర్ టి సి బస్ సర్వీసు తిరిగేలా చర్యలుతీసుకోవాలని ఆర్ టి సి రాయచోటి డిపో అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాంత్ రెడ్డి తన కార్యాలయంలో ఆర్ టి సి డిపో మేనేజర్ నారాయణ, సీనియర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నాగేంద్ర నాయక్ లతో శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు వెళ్ళు విద్యార్థులుకు, రైతులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో బస్సులు నడపాలని ఆదేశించారు. మాధవరం-చెంచురెడ్డిగారిపల్లె, శెట్టిపల్లె- పెద్దబిడికి, గాలివీడు- కడప తదితర రూట్లలో బస్సులు తిరగడంపై ఆయన ఆరా తీశారు. బస్టాండ్ అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రాయచోటి నుంచి విజయవాడకు ఇంద్ర ఏసి బస్ సర్వీసు నడిచేలా చర్యలు తీసుకుంటామని చీఫ్ విప్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, వైఎస్ ఆర్ సీపీఆర్టిసి యూనియన్ డిపో కార్యదర్శి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author