బట్టలు చించుతూ.. పైకి ఎగిరేస్తూ పైశాచికానందం
1 min read
Px02-045 LAHORE: Dec02 – Flower plants seen displayed during inauguration ceremony of flowers exhibition at Greater Iqbal Park. ONLINE PHOTO by Sajid Rana
పల్లెవెలుగు వెబ్ : పాకిస్థాన్ లో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఈనెల 14న ఓ అమ్మాయి వీడియోలు తీయడానికి గ్రేటర్ ఇక్బాల్ పార్క్ కి వెళ్లింది. అక్కడికి 300 మందికి పైగా పురుషులు వచ్చారు. అమ్మాయి ఉన్న ప్రదేశానికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులు పట్టుకుని లాగారు. ఆమెను ఎత్తుకొని గాల్లో పైకి ఎగురవేశారు. దుస్తులు చించుతూ రాక్షసానందం పొందారు. అల్లరిమూక నుంచి తప్పించుకోవడానికి ఆమె చాలా ప్రయత్నం చేసింది. మధ్యలో తప్పించుకోలేక విలవిలలాడింది. ఇదంతా గమనించిన సెక్యూరిటీ గార్డు అక్కడ నుంచి ఆమెను విడిపించారు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.