యాదవుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలి!
1 min read
అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్
విజయవాడ, న్యూస్ నేడు: యాదవుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్ అన్నారు. ఆయన విజయవాడ నగరానికి విచ్చేసిన సందర్భంగా మంగళవారం, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో అఖిల భారతీయ యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 కోట్ల జనాభాతో యాదవులు భారతదేశంలో ఉన్నారని, ఎంతోమంది యువతను గత ప్రభుత్వాలు సైన్యంలోకి తీసుకుని దేశ సేవలో తమను కూడా భాగస్తులు చేశాయని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకెళ్లాలని కోరారు. మొదటినుండి యాదవులు అనేకరకాల ఆహార వృత్తులలో, ఉత్పత్తులలో కొనసాగుతున్నారని అటువంటి వారిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయక ప్రోత్సహించాలన్నారు. గొఱ్ఱెలకాపరుల భద్రతకొరకు ప్రత్యేక భద్రత చేపట్టాలాన్నారు.రాష్ట్ర అధ్యక్షుడు లకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారిని తొలుత గుర్తించింది యాదవులేనని తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తిరుమలలోఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.యాదవ కమ్యూనిటీ హాల్,అమరావతిలో యాదవ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. పశువులను నిలవఉంచుకునే విధంగా నిలవదొడ్లకు స్థలాలు కేటాయించాలని కోరారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి తమ డిమాండ్లను వినతి పత్రం రూపంలో అందజేస్తామని స్పష్టంచేశారు.యాదవులు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారితో గెలిపించడం జరిగిందని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు అన్నారు. అత్యధిక జనాభా ఉన్న యాదవులకు రాజ్యాధికారంలో స్థానం కల్పించాలన్నారు. ఆర్థికంగా మెరుగు పడటానికి యాదవ యువతను ప్రోత్సహించి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాలలో యాదవ యువకులు అభివృద్ధి పరంగా ముందుకెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
