PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి

1 min read

– కొట్టేటి హనుమంతరావు
పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: విశాఖలో తన ఆస్తులు కోట్ల రూపాయలు విలువలుగా మార్చుకోవడానికి మూడు రాజధానులు కావాలని కోరటం ఈ అసమర్థత చేతకాని దద్దమ్మ మంత్రి ధర్మాన నిజస్వరూపం బట్టబయలు అయింది. సైనిక ఉద్యోగులకు చెందిన భూములను దొంగ పత్రాలు, దొంగ బి ఫారం లు, సృష్టించి కబ్జా చేసిన మంత్రి కుటుంబ సభ్యులపై విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్ని కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో కె .హనుమంతరావు మాట్లాడుతూ.మీ కుటుంబ సభ్యుల వ్యాపార అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నావు, నువ్వు కూడా ఒక మంత్రివా అని విమర్శించారు.. సినిమాలలో నీలాంటి వ్యక్తులు పాత్రలను గతంలో నాగభూషణం గారు చూపించారు, అంతకంటే మించిపోయావు నువ్వు అని తెలిపారు. ఏనాడైనా మీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేశారా? ఉత్తరాంధ్ర మంత్రులందరూ మూడు రాజధానులపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి గెలవాలని సవాలు విసిరారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటింది రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. మూడు రాజధానులు పై ప్రజల మద్దతు లేదు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలలో 85 శాతం మంది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలని కోరుకుంటున్నారు.. ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికలలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అన్ని ప్రాంతాల ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్, మాజీ డివిజన్ అధ్యక్షుడు అద్దూరి కొండలరావు, బ్రాహ్మణ సంగం నాయకుడు శ్రీనివాస్ శర్మ, తెలుగుదేశం పార్టీ నాయకుడు బెనర్జీ, సరోజినీ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

About Author