ముఖ్యమంత్రికి మళ్లీ పెళ్లి !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో .. అతి తక్కువ మంది సభ్యుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వధువు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చాలా ఏళ్ల నుంచి వీళ్లద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. కాగా, ఆయనకిది రెండో వివాహం. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు, పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సీఎం భగవంత్ మాన్‌కి ఇది రెండో వివాహం. ఆరేళ్ల కిందట ఆయన విడాకులు తీసుకున్నారు.