చట్టసభల్లో బీసీలకు ప్రముఖ స్థానాలను కల్పించిన ఘనత సీఎందే
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణం బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ఆయన స్వగృహం నందు పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాజిక న్యాయం దేశంలోనే ఎక్కడ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కు పరిపాలనలో పదవులు ఇచ్చి భాగస్వామ్యం కల్పించడం జరిగిందని చెప్పారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయని అన్ని పార్టీలు కూడా అత్యధిక ఓట్లు గల బీసీ కులాలకు చెందిన ఓట్లు మాత్రమే ఉపయోగించుకున్నారు. కానీ బీసీలు అంటే ఓటు బ్యాంకు కాదు బీసీలు అంటే ఆ పార్టీలకు వెన్నెముఖ అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. తాజాగా రాష్ట్రంలో 18 ఎమ్మెల్సీ స్థానాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారని అందులో 14 స్థానాలకు బిసి, ఎస్సీ, ఎస్టీలకు ప్రాముఖ్యత కల్పించడం జరిగిందని దీన్నిబట్టి బీసీలు అంటే వైయస్ జగన్ గారు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ఐదుగురు ఉప ముఖ్యమంత్రిగా పదవులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని అందులో 4 ముఖ్యమంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే పెద్ద పీట వేయడం జరిగిందని అంతేకాకుండా మంత్రివర్గంలో 70 శాతం బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల వారికే పదవులు మంత్రులుగా అవకాశం కలిగించడం జరిగిందని చెప్పారు. అలాగే రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలను బీసీలకు కేటాయించడమే కాకుండా రాజ్యసభ సీటును కూడా బీసీ కులానికి చెందినటువంటి కృష్ణయ్యను రాజ్యసభ సీటును ఇవ్వడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా శాసనసభ స్పీకర్ గా బీసీ కులానికి, శాసనమండలి చైర్మన్ గా ఎస్సీ కులానికి, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా ఒక మైనారిటీ మహిళకు ఇలా రాజ్యాంగ పదవులు సైతం బడుగు బలహీన వర్గాలకే ఇవ్వడం జరిగిందని చెప్పారు.ఇదే కాకుండా రాష్ట్రంలో 13 మంది జడ్పీ చైర్మన్ లుగా ఎన్నికైతే అందులో 9 మందికి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం జరిగిందని అలాగే 14 మంది నగర మేయర్లుగా ఎన్నికైతే వారిలో 86% మందిని అలాగే 84 స్థానాలు మున్సిపల్ చైర్మన్ లుగా వైయస్సార్ పార్టీ గెలుపొందితే వాటిలో 73% మందిని బడుగు బలహీన వర్గాల వారికే అందించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో 637 ఎంపీపీ స్థానాలను వైయస్సార్ పార్టీ గెలుపు పొందుతే అందులో 431 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికే పదవులను ఇవ్వడం జరిగిందని చెప్పారు.ఇదే కాకుండా నామినేటెడ్ పదవులలో కూడా బడుగు బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేయడం జరిగిందని 137 కార్పొరేషన్ చైర్మన్ లకు సంబంధించి 58% బడుగు బలహీన వర్గాల వారికే అందించడమే కాకుండా 484 మంది డైరెక్టర్ పదవులలో 280 మందికి బడుగు బలహీన వర్గాల వారికే ఇవ్వడం జరిగిందని చెప్పారు. అంతే కాకుండా 56 కార్పొరేషన్లలో ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయా కులాల వారికి డైరెక్టర్ల పదవిలలో కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 44 నెలల కాలము అయిందని ఈ సమయంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 1లక్ష 93 వేల కోట్లు నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం జరిగిందని అందులో 76% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి నేరుగా వారి బ్యాంకి ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత రెండు లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే వాటిలో కూడా అత్యధికంగా బడుగు బలహీన వర్గాల వారికే పెద్ద పీట వేయడం జరిగిందని చెప్పారు. ఈ 44 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే సామాజిక న్యాయం కు చిరునామాగా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని మరి నిత్యం బడుగు బలహీన వర్గాల వారి బాగోగులు కోరే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అత్యధిక మెజార్టీలతో మన ముఖ్యమంత్రి గారిని, మన శాసనసభ్యులను గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా మన జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా రాజకీయాలకు పార్టీలకు కులాలకు అతీతంగా లబ్ధి చేకూరడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగిన కూడా బీసీ కులాలు వైయస్సార్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా అధికారంలోకి తీసుకురావడానికి ప్రముఖ పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, రవి రెడ్డి.నందవరం దేవస్థానం మాజీ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా శివ శంకర్ రెడ్డి, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి ,చెర్లో కొత్తూరు మాధవరెడ్డి, చిన్నకోపెర్ల మోహన్ రెడ్డి లతోపాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.