కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి
1 min read
ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించిన 48 గంటల్లో తమ అకౌంట్లోకి నగదు జమ
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
జిల్లాస్థాయిలోనే పప్రమధంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రైతులు తమ వరి పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించిన 48 గంటల్లోనే రైతుల అకౌంట్ ల లోకి నగదు జమ అవుతుందని,చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుందని దెందులూరు ఎమ్ ఎల్ చింతమనేని ప్రభాకర్ అన్నారు,పెదవేగి మండలం దుగ్గిరాలలో రబీ సీజన్ కి సంబంధించి జిల్లా స్తాయి లోనే ప్రప్రథమంగా శుక్రవారం దుగ్గిరాల గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చింతమనేని ప్రారంభించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమన్నారు,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదు కుంటు న్నారన్నారు,దుగ్గిరాల గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిసర గ్రామాల రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తరలిస్తే 48 గంటల్లో డబ్బులు బ్యాంక్ ఎకౌంట్ ద్వారా అందుకోవచ్చని రైతులకు వివరించారు, రబీతో బాటు ఖరీఫ్ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్ర అధికారులను ఎమ్ ఎల్ ఎ కోరారు, ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా మాట్లాడుతూ 2024 రబీ సీజన్ తాలూకా 168 కోట్ల ధాన్యం బకాయిలను శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ చేతుల మీదగా రైతులకు చెల్లించామని అన్నారు,ఈకార్యక్రమం లో ఏ డి ఏ సుబ్బారావు,పెదవేగి మండల టి డి పి అధ్యక్షులు బొప్పన సుధాకర్,పెదవేగి సొసైటి అధ్యక్షులు తాతా సత్యనారాయణ( బన్న సత్యనారాయణ) దుగ్గిరాల పంచాయతీ వైఎస్ ప్రసిడెంట్ చింతమనేని గోపీ,మండల వ్యవసాయాధికారి ఎమ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
