విద్యార్థుల్ని ఉన్నత విద్యకి దూరం చేస్తున్నకూటమి సర్కారు
1 min read
వైఎస్సార్సీపీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయికుమార్ రెడ్డి
చెన్నూరు , న్యూస్ నేడు: ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఎ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిల్ని కూటమి సర్కారు చెల్లించని కారణంగా ఉన్నత విద్యార్థులు పై చదువులకి దూరమవుతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయికుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పది నెలల పాలనా కాలంలో విద్యార్థులకు ఫీజులు రాక ఉన్నత విద్య కి దూరం అవుతున్నారని మండి పడ్డారు. గత బకాయిలు 3,900 కోట్ల రూపాయిలకు ప్రభుత్వం కేవలం 1300 కోట్లు మాత్రమే నామమాత్రంగా విడుదల చేసిందన్నారు. అది కూడా మాజీ సీయం జగన్ మోహన్ రెడ్డి యువత పోరు కి పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమించిన తర్వాతే విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం లో 3,900 కోట్ల రూపాయలు చెల్లించాలన్నారు. కానీ బడ్జెట్లో కేవలం 2500 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసారని తెలిపారు. పరీక్ష ఫీజుల కోసం కోర్సు ఫీజు మొత్తం చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నా కానీ కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతుంటే విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ నిద్ర పోతున్నారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయం లో ప్రతీ క్వార్టర్ ఫీజు ఏ నెలలో ఇస్తున్నారో స్పష్టంగా పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో కళాశాల ఖాతాల్లోకి మంజూరు చేస్తామని తెలిపి ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వ తీరును దుయ్య బట్టారు. సెమిస్టర్ వారీగా ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థుల్ని ఒత్తిడి చేస్తుంటే వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్ధుల్ని విద్యకి దూరం చేసే కూటమి ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని, ఫీజుల కోసం విద్యార్థుల్ని వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.