రాజధాని కోల్పోయిన రోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలా
1 min read– నవంబర్ 1ని రాయలసీమ విద్రోహ దినంగా ప్రకటించాలి ఆర్ జేఏసీ డిమాండ్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని స్థానిక బ్రహ్మారెడ్డి హాస్పిటల్ లో గల కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్ సీమ కృష్ణ రంగముని నాయుడు లాజరస్ పాలకొమ్మ అశోక్ మాట్లాడుతూ రాయలసీమ సమాజానికి వాస్తవాలు తెలియాలని 1956లో కర్నూల్ లో ఉన్న రాజధాని కోల్పోయిన రోజు నవంబర్ ఒకటి అని ఆ రోజును రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం గా వేడుకలు జరుపుకోవడాన్ని రాయలసీమ ప్రజానికం తీవ్రంగా ఖండిస్తోందని రాయలసీమ సమాజానికి ఇది దుర్దినమని దీనిని బ్లాక్ డే గా ప్రకటిస్తున్నామని వారు అన్నారు 1953 నుంచి 1956 వరకు కొనసాగిన రాజధాని తిరిగి అదే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా నేడెందుకు తిరిగి కర్నూల్లో రాజధాని ఏర్పాటు చేయలేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, వైజాగ్ లో రాజధాని పెడతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే ఇది ఎలా శ్రీబాగ్ ఒప్పందం అవుతుందని వారు అన్నారు,ఒకపక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ ప్రజానీకం పాలన రాజధాని కోరడం లేదని ప్రకటనలు చేస్తుంటే ఇంకోపక్క ధర్మాన ప్రసాదరావు విశాఖపట్నం ఏకైక రాజధాని ప్రకటించడాన్ని రాయలసీమ సమాజం తీవ్రంగా ఖండిస్తోందని మంత్రులు వారి ప్రకటనలను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని జరుగుతున్న ఉద్యమాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కర్నూల్ లో తిరిగి రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో బెంచులతో సంబంధం లేని పూర్తిస్థాయి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లప్ప చంద్రశేఖర్ వినోద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.