గేదెల సూర్య ప్రకాష్ సోదరుడు మరణం వారి కుటుంబానికి తీరని లోటు
1 min read

ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్
భౌతికకాయాన్ని కి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జెపి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోణంగి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గేదెల సూర్యప్రకాష్ సోదరుడు గేదెల నాగ వెంకట సత్యనారాయణ స్వర్గస్థులు అయినారు. వారి భౌతిక కాయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సోదరుడని కోల్పోవడం బాధాకరమని సూర్య ప్రకాష్ ని కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గుర్నాథ్, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు.


