NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామ పంచాయితీ కార్యదర్శికి  ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

1 min read

హొళగుంద న్యూస్ నేడు:   హొళగుంద గ్రామ పంచాయతీకి తిరిగి వచ్చిన రాజశేఖర్ గౌడు కు ఎస్ డి పి ఐ కార్యకర్తలు  గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా  స్వాగతం తెలిపారు.గ్రామ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ రాజశేఖర్ గౌడకు  మరియు సర్పంచ్ తనయుడు పంప కు  సన్మానం చేయడం జరిగింది, రాజశేఖర్ గౌడ్ తిరిగి మరల- హొళగుంద  గ్రామానికి రావడం కొత్త ఉత్సాహాన్ని అందించింది.ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న  త్రాగునీటి సమస్యను వివరిస్తూ హొళగుంద 1,వ వార్డు నుండి ఎస్సి కాలనీ 2వ వార్డు దిడ్డి కాలనీ 3వ వార్డు నీల్ కానట్రాయ గుడి వెనకాల 4వ వార్డు సీనప్ప బావి 5వ వార్డు పెద్ద మసీదు లైను 6వ వార్డు అయోధ్య నగర్ 7వ వార్డు సినిమా లైన్ బస్టాండ్ వరకు,గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కొండపై ఉన్న మంచి నీటి ట్యాంక్ నుండి ఇన్ని వార్డులకు త్రాగునీటి సరఫరా అవుతుంది.కానీ నీళ్ళు 10 లేదా 12 రోజులకు ఒక సారి వస్తాయి కావున ఈ సమస్య 4 ఇంచుల పైపు లైన్ ఉందట వలన ట్యాంక్ నిండడానికి 5 గంటల సమయం పడుతుంది.రోజోకు మూడు ట్యాంకులు నింపి వార్డులకు వదులుతున్నారు ఇలా ఎక్కువ సమయ పడటం చూసి సర్పంచ్ మరియు సెక్రటరీ దృష్టికి ఎస్ డి పి ఐ వార్డు మెంబర్లు ఇంతకుముందే సమస్యను తీసుకువెళ్లడం జరిగింది.సమస్యను గమనించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వార్డు మెంబర్లు కలిసి ఇంకో 7 ఇన్చుల పైపులైను వేయాలని పనులు మొదలుపెట్టారు. కానీ పనులు అర్ధంతరంగా ఆగడం వలన నీటి సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారింది.అందువలన ఎస్ డి పి ఐ పార్టీ బ్రాంచ్ తరపున పనులు వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.అలాగే పనులు పూర్తి చేసి 3రోజులకు ఒక సారి నీటి సరఫరా చేయాలని కోరారు.

About Author