నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు అప్పు రూ. 46 లక్షల కోట్లు.. మరి మోదీ హయాంలో ?
1 min readపల్లెవెలుగువెబ్ : అప్పులు చేయడంలో సీఎం జగన్, ప్రభుత్వ ఆస్తులు అమ్మడంలో ప్రధాని మోదీ పోటీ పడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. మోదీ దేశాన్ని అప్పుల కుప్ప చేయగా, జగన్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపించారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల కాలంలో నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధాన మంత్రుల పాలనలో కేంద్రం చేసిన అప్పు రూ. 46 లక్షల కోట్లు అని అన్నారు. 2014 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో మోదీ పాలనలో కేంద్రం చేసిన అప్పు రూ.74 లక్షల కోట్లు అన్నారు.