NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప సర్పంచ్ టీడీపీ పార్టీకి సంబంధం లేదు

1 min read

– మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కే విజయభాస్కర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​ చెన్నూరు: చెన్నూరు మండలం ఉప్పరపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ శంఖవరం సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అతను తెలుగుదేశం పార్టీ తరపున గెలవలేదని చెన్నూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కల్లూరి విజయ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. చెన్నూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఉపసర్పంచ్ సుబ్బరాయుడు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తినని వైసీపీ తరపున గెలిచి ఆ పార్టీలోనే తెలుగు దేశంలో నుంచి వైసీపీలో చేరుతున్నట్లు వైసిపి నాయకులు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉప్పరపల్లిలో వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఉప సర్పంచ్ సుబ్బరాయుడు తో పాటు మరో వార్డు సభ్యుడు ఓబులేసు తెలుగుదేశం పార్టీ వారు కాదని తాము బలపరచలేదని చెప్పారు.

About Author