తారకరామారావు చేసిన కృషి ఎనలేనిది…
1 min read
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
మహానంది న్యూస్ నేడు: నందమూరి తారకరామారావు చేసిన కృషి ఎనలేనిదని,బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్‌టి రామారావుకే దక్కుతుందని, మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ 102వ జయంతి పురస్కరించుకొని మహానందిలోని ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మహానంది తహశీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ రీ సర్వే తహాశీల్దార్ కామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చేసిన అనతి కాలంలోనే దీర్ఘకాలికంగా బడుగు బలహీన వర్గాల మేలుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు.తెలుగుదేశం పార్టీని దిన దిన అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు.ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రగామిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కంచర్ల శివ, సర్పంచ్ అస్లాం భాష,మండల క్లస్టర్ ఇంచార్జీలు నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, కాకర్ల శివ, గాజులపల్లె మహేశ్వర్ రెడ్డి, రవి స్వామి, పాశం శ్రీనివాసులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
