వేసవిలో దాహర్తి తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం
1 min read
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చంటి ప్రారంభించారు.స్వయంగా పాదచారులకు, వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ఏలూరు శాఖ అధ్యక్షులు రాథావల్లభ దాస్, ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, త్రిపర్ణ రాజేష్, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
