జనవరి 26నాటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అందుబాటులోకి తేవాలి! సీఎం జగన్ సమీక్ష
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: ప్రభుత్వం తలపెట్టిన ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్‌ను కార్యక్రమం జనవరి 26నాటినుంచి ప్రారంభం కావాలని సీఎం జగన్ అన్నారు. బుదవారం క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖతో సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష జరిపారు. ఇందులో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ సమీర్‌శర్మ, ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్సింఘాల్, ప్రత్యేక కార్యదర్శి నవిన్‌కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని బాస్కర్, కోవిడ్ టాస్క్‌పోర్స్ చైర్మన్ కృష్ణబాబు, ఆర్థిక కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కోవిడ్ ముందస్తు నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, హెల్త్‌హబ్ వంటి అంశాలపై చర్చించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమయితే 104వాహనాలను కొనుగోలు చేయాలని, విలేజ్క్లీనిక్ల నిర్మాణంపై అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు. మహిళలు, బాలికల ఆరోగ్య పరిరక్షణకు అనువైన స్వేచ్ఛా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అవసరమయితే పీహెచ్‌సీల్లో మహిళా వైద్యులను నియమించాలన్నారు. ఆరోగ్యశ్రీ,పై గ్రామ, వార్డు సచివాలయాల్లో సంబంధిత హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితులు లేకుండా, ప్రధాన వైద్యచిక్సిలకు సంబంధించిన వైద్యశాలలు రాష్ట్రంలోనే అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు.