కేంద్రంపై ఇక యుద్ధమే: సీఎం కేసీఆర్
1 min read
పల్లెవెలుగు వెబ్: వరి ధాన్యం కొనుగోలు చేసేంతవరకు కేంద్రంపై పోరాటం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. కేంద్రంపై యుద్ధం చేస్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా జరుగుతోంది.
ధర్నాలో సీఎం కేసీఆర్ , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ నేతలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ… రైతుల పట్ల కేంద్రం పూర్తి వ్యతిరేకతతో ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యుద్ధాన్ని ప్రారంభించామని… ఇది కేవలం ఆరంభం మాత్రమేనని… రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఉద్ధృతం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. పంజాబ్‌లో మాదిరి తెలంగాణలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాని కోరినా ఏమాత్రం స్పందన లేదన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.