ప్రజా శ్రేయస్సే… లక్ష్యం
1 min readఎమ్మెల్యే నేతృత్వంలో సుపరిపాలన అందిస్తాం..
– చైర్మన్ జులుపాలా వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్, గూడురు: గూడురు నగర పంచాయతీ అభివృద్ధి తో పాటు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాలన అందిస్తామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం అన్నారు. ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన వెంకటేశ్వర్లు, అస్లాం లను మంగళవారం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ సమక్షంలో గూడూరు నగర పంచాయతీ లోని చైర్మన్ చాంబర్లో ఆసీనులయ్యారు. నూతనంగ చైర్మన్ చాంబర్లో అడుగుపెడుతున్న సందర్భంలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం లకు గూడూరు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు , సిబ్బంది పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అలాగే నగర పంచాయతీ కౌన్సిలర్ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైస్ చైర్మన్ అసలు మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీ లోని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.