రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం …
1 min read
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ లు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.ఈ సంధర్బంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.