‘కార్పొరేట్’వైద్యం అందించడమే లక్ష్యం
1 min read– ఎమ్మెల్యే పి రవీంద్రనాథ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు : రాష్ట్రంలోని ప్రతి పేదవాడిక మెరుగైన వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని అందుకే రాష్ట్రంలో వైద్యరంగంలో సమూలంగా రూపురేఖలు మార్చి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం జరుగుతుందని కమలాపురం శాసనసభ్యులు పి, రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చెన్నూరు హజ్ హౌస్ క్వారంటైన్ కేంద్రంలో తమ పోచ మ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత నిధులు దాదాపు కోటి రూపాయల వ్యయంతో వంద పడకల ట్రాన్సిట్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయమని, అందులో భాగంగాన చెన్నూరు హజ్ హౌస్ లో ఉన్న క్వారంటైన్ కేంద్రం లో 100 పడకల ట్రాన్సిట్ తో పాటు, ప్రతి పడక వద్ద ఆక్సిజన్ పైప్ లైన్, ఐదు లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేట్, ఒక టేబుల్ ఫ్యాన్ ఏర్పాటు చేయడం జరిగింది, 100 పడకల ట్రాన్సిట్ ఆసుపత్రికి సంబంధించి మొత్తం పనులను ఆయన దగ్గరుండి పరిశీలించామనన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మస్తాన్వలి, తాసిల్దార్ అనురాధ, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్, ప్రసాద్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ జి యన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివరాం రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు చిర్ల సురేష్ యాదవ్, ఎంపిటిసిలు ముది రెడ్డి సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మెడికల్ రవి రెడ్డి, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, అబ్దుల్ రబ్, కరీం, తదితరులు పాల్గొన్నారు.