NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విత్తనాలు వేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వర్షబావ  పరిస్థితిలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో  పత్తి ఇతర విత్తనాలను ఒకటికి రెండు సార్లు వేసిన రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తాసిల్దార్  సుదర్శన్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం నాడు  సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.   సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్, అశోక్,యూసుఫ్ లు మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో అరకొర వర్షాలకు ప్రారంభంలో పత్తి ఇతర విత్తనాలు ఒకటికి రెండుసార్లు రైతులు ఆశతో విత్తనాలు వేశారని కానీ వర్షాలు రాక నాటిన, వేసిన విత్తనాలు మొలవక, మొలచిన గిటక బారిపోవడం, ఎర్రబారిపోవడం  తో రైతులకు చాలా నష్టం జరిగిందని అన్నారు.  వేలకు వేలు రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు వర్షాబావ పరిస్థితి వల్ల తీవ్రంగా నష్టపోయారని ఆందోళన చెందారు. ఇలాంటి ఇలాంటిి పరిస్థితులలో రైతులు అప్పుల పాలవుతున్నారని, వెంటనే ప్రభుత్వం ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులను గుర్తించి వారిని ఆదుకోవాలని వారికి ఉచితంగా విత్తనాలు, మందులు, ఎరువులు ఇవ్వాలని వారి డిమాండ్ చేశాారు. అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా విత్తనాలు వేస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ తగిన సలహాలు, సూచనలు    చేయాలని కోరారు. ఈ మేరకు సిపిఎం నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అవకాశం ఉన్న మేరకు పందికొన రిజర్వాయర్ నుండి కుడి కాలువ నుండి నీళ్లు వదలాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రజాసంఘాల కార్యకర్తలు మహబూబ్ బాషా, ఓంకార్, అనిల్, పాండు, శ్రీనివాసులు, వీరన్న రైతులు పాల్గొన్నారు.

About Author