వికసిత భారత సంకల్పయాత్ర వాహనాన్ని ప్రారంభించిన గవర్నర్
1 min read– కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాల్స్ ను సందర్శించిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని గాలాయగూడెం శ్రీ కృష్ణ కన్వర్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి, శాసనసభ్యులు కొఠారి అబ్బయ్య చౌదరి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, హౌసింగ్ పీడీ కెవిఎస్ రవికుమార్ తదితరులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ కు జిల్లా పోలీస్ వారు గౌరవ వందనం చేశారు. తదుపరి వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల ప్రచారానికి ఉద్దేశించి రూపొందించిన ప్రచార వాహనాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సంబంధించి ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సందర్శించారు. వీటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పి. ఎం. ఆవాస్ యోజన, వ్యవసాయ శాఖ స్టాలు మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ, వికసిత భారత సంకల్పయాత్ర, పోషన్ అభియాన్, పౌర సరఫరాలు, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ స్టాల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, సామాజిక భద్రతా పథకం, వైద్య ఆరోగ్యశాఖ స్టాల్, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం, హర్ ఘర్ జల్ జల జీవన్ మిషన్, ఆధార్ నమోదు కేంద్రం, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మై భారత్ రిజిస్ట్రేషన్ కౌంటర్, ప్రధానమంత్రి ప్రణామ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన, కిసాన్ డ్రోన్ తదితర స్టాల్స్ ను గవర్నర్ సందర్శించారు.