PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారుల చేతివాటం..

1 min read

పాఠశాలలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలం .
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: నాడు నేడు పనులకింద పాఠశాలలను అభివృద్ధి చేయడం లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఆది, జిల్లా ఉపధ్యక్షుడు రవికుమార్ అన్నారు. బుధవారం నాడునేడు కింద పనులు చేపట్టిన పాఠశాలను ఆయన పరిశీలించారు. అనంతరం నందికొట్కూరు విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి కానీ తగ్గడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు పనుల్లో కొందరు అధికారులు చేతివాటం చూపిస్తున్న ఉన్నత అధికారులు వాటిని నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నాడు నేడు పనులు నాసిరకంగా జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం ఉడకి ఉడకని అన్నం, నీళ్ల సారంబారుతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని అన్నారు. మురిగిన గుడ్లను సైతం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో అందిస్తున్నారని ఇదంతా తెలిసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకు నేరెత్తన్నట్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటని అన్నారు. నాసిరకంగా మధ్యాహ్నం భోజనం అందించేటువంటి ఏజెన్సీలను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మధ్యాహ్న భోజన కార్మికులను నిర్మించి వారిని ఉద్యోగులుగా గుర్తిస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, వెంకటేష్, రాము, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author