NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ‌ధాని పై హైకోర్టు కీల‌క తీర్పు.. ఏం చెప్పిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ హైకోర్టు అమ‌రావ‌తి రాజ‌ధాని విషయంలో కీల‌క తీర్పు వెలువ‌రించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చిచెప్పింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ప్ర‌భుత్వానికి సూచించింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు.. 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం డెడ్ లైన్ కూడా విధించింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్ సర్కార్‌కు కోర్టు సూచించింది.

                       

About Author