హమాలీ కూలీల కూలి రేట్ల పెంపు హర్షనీయం..
1 min read
భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర సభ్యులు కాకర్ల శ్రీనివాసరావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పౌరసరఫరాల సంస్థలో పనిచేసే హమాలీ కార్మికుల కూలి రేట్లు పెంపు హర్షినియమని, ఇఫ్ట్ జిల్లా నేత, భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర సభ్యులు కాకర్ల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు వేతనాలు ఏమాత్రం పెంచలేదని, అన్ని శాఖల మరియు సంస్థలలో పనిచేసే హమాలీ కూలీలు భార్య పిల్లలతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.2024 సంవత్సరంలో జనవరి నుంచి పెరిగిన కూలి రేట్లు ను ఏరియర్స్ రూపంలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం జీవో 14న విడుదల చేసిందని కార్మికునిగా, కార్మిక సంఘ నాయకునిగా కార్మికుల కూలి రేట్లు పెంపు చాలా సంతోషమని అన్నారు.