పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు సమీపంలోని మోడల్ స్కూల్ పక్కన ఉన్న శ్రీ బీర లింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో ఆదివారం కురువల కార్తీక వనభోజన మహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ , కిష్టప్ప రిటైర్డ్ జడ్జి, గద్వాల జడ్పీ చైర్మన్ సరితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఆర్థికంగా రాజకీయంగా అందరూ ఎదగాలని ఏ రంగంలోనైనా తమ కులస్తులు ఉంటే వారికి ప్రోత్సాహం కల్పించాలని జిల్లాలోని రాష్ట్రంలో గాని ఏ సమస్య ఉండే సమస్యల పైన మా దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని శ్రీశైలం సత్రం అలాగే కురువల సమస్యల పైన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు ఉసిరి వృక్షం దగ్గర పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కర్నూలు జిల్లా కురవ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి రంగస్వామి గౌరవాధ్యక్షులు కిష్టన్న మాట్లాడుతూ సంఘం పురోభివృద్ధికి జిల్లాలో కురులు అందరూ సహకరించాలని బీరప్ప గుడి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలని అలాగే వేదిక పైన పాల సుంకన్న కుమార్తె నందిని గుడి దగ్గర నిర్మించే హాస్టల్ అభివృద్ధి కోసం ఐదు లక్షలు విరాళంగా అందజేశారు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అమీలియా హాస్పిటల్ అధినేత ప్రసాద్ పూర్తి సహకారం అందిస్తానని చెప్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కత్తి శంకర్,బి . వెంకటేశ్వర్లు కే . దివాకర్ ,కెసి నాగన్న తిరుపాల్, తౌడు శ్రీనివాసులు ,బూదురు లక్ష్మన్న ,కుంటనహాల్ నర్సింహులు ,నాగశేషులు ,బి .రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.