NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి కూలీలకు డబ్బులు రాక పనికి రావడం లేదు…

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  ఉపాధి కూలీలకు సరైన సమయంలో కూలీ డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు రావడంలేదని… మహానంది మండల ఏ పీ ఓ మల్లికార్జున పేర్కొన్నారు. పై అంశం ఉపాధి కూలీలు చెబితే ఒక అర్థం ఉంది… కానీ ఒక అధికారి స్థాయిలో ఉండి కూలీలకు డబ్బులు ప్రభుత్వం సకాలంలో ఉపాధి కూలీలకు డబ్బులు విడుదల చేయకపోవడంతో తాము పనులు కూడా చేపించలేకపోతున్నామని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో ఉపాధి కూలీలకు పని చూపించేందుకుగాను ముందస్తు చర్యల్లో భాగంగా ఏ ఏ గ్రామాల్లో ఎన్ని పనులు చేయించాలి, ఎక్కడెక్కడ చేయించాలి, అత్యవసరమైనవి ఎన్ని పనులు ఉన్నాయి అనే అంశంపై వారి వద్ద ఎలాంటి నివేదిక లేకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నట్లు తెలుస్తుంది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి పనుల్లో భాగంగా చేపట్టాల్సిన వివరాలు కు  సంబంధించి నివేదికను మే నెల మధ్య వారంలో జిల్లా ఉన్నతాధికారులకు పంపడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధి పనులు చేయించడం సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఉపాధి కూలీలకు ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని అధికారి పైకి చెబుతున్న మండలంలోని గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వానికి లేదా ఉన్నతాధికారులకు మే నెల రెండో వారంలో నివేదికలు తయారుచేసి పంపడం వారి పనితీరుకు నిదర్శనంగా మారింది. తాము చేసే తప్పులను ప్రభుత్వం లేదా ఉన్నత అధికారులపై నెట్టడంలో ఆ అధికారి సిద్ధహస్తుడని ఆరోపణలు వినవస్తున్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *