గో అక్రమ రవాణా/హత్యలపై ఉన్న నిషేధ చట్టాన్ని అమలు జరపాలి
1 min read
24/05/2025
కర్నూలు, న్యూస్ నేడు: రాబోయే రోజుల్లో బక్రీద్ సందర్భంగా కర్నూల్ నగరంలోని జరగబోయే గో అక్రమ రవాణా/హత్యలపై ఉన్న నిషేధ చట్టాన్ని అమలు జరపాలని నగరంలో ఉన్న జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష కి, జిల్లా పోలీసు అధికారి ఎస్పీ కార్యాలయానికి, జిల్లా సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ కార్యాలయానికి, జిల్లా రవాణా శాఖ అధికారికి శాంత కుమారి, జిల్లా పశు వైద్య అధికారి వసంత కుమార్, జిల్లా ఆహార మరియు భద్రత అధికారి రాజగోపాల్, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, 3 టౌన్ సిఐ, 4 టౌన్ సిఐ, తాలూకా సిఐ, రూరల్ సిఐ, నగరంలో ఉన్న ఉన్నతాధికారులను కలిసి టిసి మద్దిలేటి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు, ఈపూరి నాగరాజు జిల్లా కార్యదర్శి, బెస్త పరశురాముడు జిల్లా గోరక్ష ప్రముఖ్, గోవిందరాజులు జిల్లా ఉపాధ్యక్షులు, గూడూరు గిరిబాబు జిల్లా సహకారదర్శి, నీలి నరసింహ విభాగ్ విశేష సంపర్క ప్రముఖ, తిమ్మారెడ్డి, సాయినాథ్, కరణం సుధాకర్, రాజేంద్రప్రసాద్, చైతన్య విశ్వ హిందూ పరిషత్ బృందం గోవధ చట్టాలను కఠినంగా అమలు పరచాలని ఉన్నతాధికారులకు మెమొరాండం అందజేస్తూ కోరడమైనది.