మహా సంకల్ప పాదయాత్ర ఒక చారిత్రాత్మకం
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఐదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ప్రజా సంకల్ప యాత్ర లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని నేడు పార్టీలకతీతంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు.అదే విధంగా సీయం జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్,కౌన్సిలర్ లు చాంద్ భాష,అబ్దుల్ హామీద్ మియ్య,లాలు ప్రసాద్,చెరుకు సురేష్, అబ్దుల్ రవూఫ్,ముస్లిం మైనారిటీ తాలుకా అధ్యక్షులు అబూబక్కర్,వైసిపి నాయకులు మన్సూర్,చింత విజయ్ కుమార్,కిరణ్ కుమార్ రెడ్డి,కురువ శ్రీను,వి.ఆర్ శ్రీను, పి.రమేష్,సనా అబ్దుల్లా,శాలి భాష తదీతరులు పాల్గొన్నారు.