యుగపురుషుడు ఎన్టీఆర్…
1 min read
మంత్రాలయం , న్యూస్ నేడు : తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టిడిపి సీనియర్ నాయకులు మాధవరం రఘునాథ్ రెడ్డి అన్నారు. మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జోహర్ ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి మహనీయుడు ఇక ఎప్పుడు పుట్టడని తెలిపారు. తెలుగు వారికి ఆరాధ్య దైవంగా మారడం జరిగిందని తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. సినీ పరిశ్రమ లో, రాజకీయం లో మచ్చ లేని నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో బారికి ఉరుకుందు, ఆలం భాష, భీంరెడ్డి, కేశవయ్య, రాఘప్ప టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.