NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దత్తపుత్రుడి ముసుగు తొలగింది !

1 min read

పల్లెవెలుగువెబ్:తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నుంచి వెనువెంటనే ఎదురు దాడి మొదలైపోయింది. ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు… పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ… పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని స్పష్టం చేశారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ వ్యాఖ్యలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పవన్ తాజా వ్యాఖ్యలతో దత్తపుత్రుడి ముసుగు తొలగిందని నాని వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి ముసుగు వెనుక చంద్రబాబు ఉన్నాడని తేలిపోయిందని కూడా నాని అన్నారు.
     

About Author