పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎంఈఓ
1 min readపల్లెవెలుగు, వెబ్ గడివేముల: మండలంలోని గని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఫార్మేటివ్ 1, పరీక్షా కేంద్రాన్ని బుధవారం నాడు ఎంఈఓ రామకృష్ణుడు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరము ఫార్మేటివ్ వన్ ను క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ గా నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షకు ప్రశ్నాపత్రాన్ని ప్రభుత్వమే అందజేస్తుందని, 1 నుంచి 8వ తరగతి వారు జవాబును ఆబ్జెక్టివ్ తరహాలో ఓఎంఆర్ సీట్లో నమోదుచేయవలసి ఉంటుందని, ఈ ఓఎంఆర్ షీట్లను విద్యార్థి పేరుతో సహా ప్రభుత్వమే ఇస్తుందని, అలాగే పరీక్షలు అనంతరము ఈ ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రానికి పంపి, రాష్ట్ర కార్యాలయంలో మూల్యాంకనం జరుగుతుందని అనంతరము మార్కులను ఆన్లైన్లో పొందుపరుస్తారని, దీని ద్వారా విద్యార్థుల ప్రగతి తెలుస్తుందని తెలిపారు, ఈ పరీక్షలను మండలంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరము జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు.