NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మునిసిపల్ కార్యాలయాన్ని పంచాయతీ బోర్డు స్థలంలోనే నిర్మాణం చేయాలి

1 min read

– కమలాపురం ప్రజానేత సాయినాథ శర్మ డిమాండ్

పల్లెవెలుగు వెబ్ కమలాపుం:  కమలాపురం మున్సిపల్ కొత్త కార్యాలయాన్ని పంచాయతీ బోర్డ్ స్థలం లోనే నిర్మాణం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగునాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ డిమాండ్ చేసారు. కమలాపురం లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమలాపురం పట్టణం నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం ఉంటే పట్టణం లోపల ఉండే ప్రజానీకానికి చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. మున్సిపల్ కొత్త కార్యాలయం ను మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణ లో నిర్మాణం చేయడం వల్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లా లనుకున్న పట్టణ ప్రజలు దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు.అంతేగాక  మున్సిపల్ కార్యాలయం కూడా కమలాపురం పట్టణం లో లేకపోతే రైల్వే గేట్ లోపల ఉన్నా కమలాపురం పట్టణం పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరం అవుతుందన్నారు. ఇప్పటికే కమలాపురం పట్టణం లో అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని దీనికి తోడుగా మున్సిపల్ కార్యాలయం సైతం పట్టణం లోపలి నుంచి బైటికి తరలిస్తే ఇక పట్టణం లో అభివృద్ధి ఏ మాత్రం జరగదన్నారు. కమలాపురం పట్టణం ప్రజలకు ఎంతో కాలంగా తీరని ఆశనిపాతంగా ఉన్నా రైల్వే హై లెవెల్ వంతెన కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచన కనిపించడం లేదన్నారు.కమలాపురం అభివృద్ధి పట్ల ఎన్నికల సమయంలో గంప గుత్తు గా హామీలు కురిపించే నాయకులు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం లో మాత్రం ఆసక్తి కనపరచక పోవడం దురదృష్ట కరమన్నారు. రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరుతో పరిపాలన వికేంద్రకరణ చేయాలని మూడు రాజధానుల కోసం ఆపసోపాలు పడుతుంటే కమలాపురం పట్టణంలో మాత్రం అభివృద్ధి ఒక చోట మత్రమే ఉండడానికి అధికార పార్టీ నాయకులు ఉత్సాహం చూపించడం కమలాపురాన్ని అభివృద్ధికి దూరం చేయడమేనన్నారు. కమలాపురం పట్టణం అభివృద్ధిని దృష్ఠిలో పెట్టుకొని ఇప్పటికైన అధికార పార్టీ, సంబంధిత అధికారులు కమలాపురం పట్టణంలోనే నూతన మున్సిపల్ కార్యాలన్ని పాత పంచాయతీ బోర్డ్ ఆవరణ లోనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉపాధి హామి పథకాన్ని కమలాపురం పట్టణం నుంచి తీసివేసి పట్టణం లోని నిరుపేదలను ఇప్పటికే ఇబ్భందులకు గురిచేసారన్నారు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ది కి పరిపాలన వికేంద్రకరణ ఎంతో ముఖ్యమని ప్రజల అభీష్టం కూడా పట్టించుకోని వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల కే మొగ్గు చూపిన విధానాన్నే కమలాపురం పట్టణంలో అధికార పార్టీ నాయకులు అమలుచేసి కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని కమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసే విధంగా  చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ప్రజలతో కలసి తాము భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

About Author