PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ ను కలిసిన నూతన సబ్ కలెక్టర్

1 min read

– సబ్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: నూతన సబ్ కలెక్టర్ గా మంగళవారం ఉదయం విధులలో చేరిన శ్రీ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఐఏఎస్ రాయచోటి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ను నేడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. చింటూరు సబ్ కలెక్టర్ గా మరియు చింటూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న 2020 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ గారిని రాజంపేట సబ్ కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విధితమే. రాజంపేట నూతన సబ్ కలెక్టర్ గా విధులలో చేరిన శ్రీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు జిల్లా కలెక్టర్ గిరీష పియస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం డివిజన్ కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. రాజంపేట డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.

About Author