ఆ వ్యాక్సిన్లతో వీర్య కణాల సంఖ్య తగ్గదు
1 min readపల్లెవెలుగు వెబ్: మొడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లతో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య ఏర్పడుతుందా ?. వీర్య కణాల సంఖ్య తగ్గుతుందా ?. అంటే కాదనే సమాధానిమిచ్చింది ఓ అధ్యయనం. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మియామి శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ఈ విషయం వెల్లడైంది. 45 మంది వాలంటీర్ల మీద వారు పరిశోధనలు జరపగా.. వ్యాక్సిన్ల వల్ల వీర్య కణాల సంఖ్యలో తగ్గుదల ఉండదని స్పష్టమైంది. వ్యాక్సిన్ వేసుకున్న ఏ ఒక్కరిలోను వీర్య కణాల సంఖ్య తగ్గలేదని పరిశోధనలో తేలింది. వాస్తవానికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక వారిలో వీర్య కణాల సంఖ్య, చలనశీలత కొంత వరకు మెరుగుపడిందని అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్, మొడర్నాలో సజీవ వైరస్ కాకుండా.. ఎమ్ఆర్ఎన్ఏ ఉంటుందని .. అది వీర్యకణాల మీద ఎలాంటి ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు గుర్తించారు.