కురువలకు జెడ్పీచైర్మన్ పదవి కేటాయించాలి
1 min readపల్లవెలుగువెబ్, కర్నూలు: జిల్లాలో అత్యధిక జనాభా గల కురువలకు జెడ్పీచైర్మన్ పదవి కేటాయించాలని జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు డా. టి. పుల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి కోరారు. మంగళవారం కురవసంఘ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో గౌరవ అధ్యక్షులు డా. టి. పుల్లన్న మాట్లాడుతూ జిల్లాలో కురువలను గుర్తించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కె. బి. నర్సప్పకు జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చిందని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ బత్తిన వెంకటరాముడుకు జెడ్పీచైర్మన్ పదవి దక్కిందని గుర్తు చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా జిల్లాలో కురువలకు ప్రాతినిధ్య అవకాశం ద్వారా జెడ్పీచైర్మన్ పదవి కేటాయించాలని సీఏం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 68 మంది కురువలు గెలుపొందారని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, బి. సి. తిరుపాల్, కె. సి. నాగన్న, వెంకటకృష్ణ, లక్ష్మన్న, నగర నాయకులు బి. రామకృష్ణ, దివాకర్, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.