NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల సమస్య లను వేగంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం

1 min read

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశం

నిర్ణీత గడువు లోగా నివేదికలు సమర్పించాలని అధికారులకు ఎస్పీ ఆదేశం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్  అదనపు ఎస్పీ అడ్మిన్  వై. ప్రసాద్ రావు ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు.ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు.ఇందులో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ (ప్రజల సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 39 పిర్యాదులను  ఎస్పీ మరియు  అదనపు ఎస్పీ అడ్మిన్ స్వయంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులను కలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా ఆలకించి, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మరింత సులభతరమైన సేవలు అందించేలా ఈ గ్రీవెన్స్ కార్యక్రమా న్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి పారదర్శకమైన ధర్మ యాప్ ద్వారా చేపట్టారు. ప్రజలు తమ ఫిర్యాదుల పురోగతి మరియు స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించి సమాచారం పొందవచ్చని సూచించారు.ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ బాధితులకు వేగంగా న్యాయం అందించడమే మా బాధ్యత అని అధికారులు తెలియ చేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *