బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న వాసవి మాత
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని కన్యక పరమేశ్వర అమ్మవారి శాలలో దసరా నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత దర్శనము ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలతో, కుంకుమార్చనలు, హోమాలు, పారాయణాలు, మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాజా మురళి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వాసవి మాత దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులు బైసాని సురేష్, కార్యదర్శి ఊటుకూరి రమేష్, కోశాధికారి జోన్నలగడ్డ హరికృష్ణ,సహాయ కార్యదర్శిలు బైసాని గిరిబాబు ,యిసికేల మురళి కృష్ణ,సహాయ కోశాధికారి లు నాయకంటి గురుప్రసాద్ ,జాక్క శేషుపణి, కార్యవర్గ సభ్యులు:- వంకదారి నాగరాజు,అముదాల నవిన్, నిచ్చెన మెట్ల గురుదత్తు,పొలమడ సుధీర్ కుమార్ ,కూన వెంకట శేషగిరిరావు, అర్వేటి సతిష్ కుమార్,లింగం రామాంజనేయులు, రాజా రవికాంత్,కుప్పా నాగేంద్ర,నూకల నాగరాజు మరియు ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.


