PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్య తీరదా.. రహదారికి మోక్షం లేదా…!

1 min read

– బడిబాటకు గ్రహణం..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: అధికారులకు సమస్య తెలిసిన స్పందించే దాఖలాలు కను చూపు మేర కనపడడం లేదని మండల వాసులు ఆరోపిస్తున్నారు ప్రజా సంఘాలు సమస్యపై ఆందోళన నిర్వహించిన అధికారులకు చీమకుట్టినట్టు లేదని స్పందనలో అర్జీలు ఇచ్చిన సమస్య పరిష్కారం కావడంలేదని ప్రజాసంఘాలైన రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పాణ్యం మండలంలో ap మోడల్ స్కూల్, కాలేజీ కస్తూరిబా స్కూల్, కాలేజీ, గర్ల్స్ హాస్టల్ లకు శాశ్వత రహదారి వేయాలని రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తినిప్రతాప్, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనము వెంకటాద్రి లు డిమాండ్ చేశారు గతంలో 2016 లో ఈ పాఠశాల,లు ఏర్పాటు చేసి వాటికీ రహదారి, స్కూల్ లకు కాంపౌండ్ వాల్ నిర్మించకుండా వదలిపోయారని ఆరోపించారు విద్యార్థులకు భద్రతలేక భయం తోఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయంతో చదువుకుంటూ ఉన్నారని గత ఆరు సంవత్సరాలనుండి ఇప్పటి వరకు స్కూల్, కాలేజీ లకు రోడ్డు కాంపౌండ్ వేయాలని విద్యార్థి, యూవజన, ప్రజాసంఘాలు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ధర్నా లు చేసిన అధికారులు తూతూ మంత్రంగా ఉచిత హామీలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారని.. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ హామీలు వ లన ఆశలు కన్నీళ్లు గా మిగిలిపోతున్నాయి ఆరు సంవత్సరాలనుండి గ్రామస్తులు మధ్యలో ఉన్న రోడ్డు మీద గ్రామస్తులతో ప్రతిరోజూ విద్యార్థులు తో గొడవలు పడుతూ వెళ్ళుతున్నారు. దాదాపుగా 2000 మంది విద్యార్థులు, 60మంది టీచర్ లు గులకరాళ్లలో, కంకర రాళ్లమధ్య 1/2 km దూరంకాలి నడకతో వెళ్ళాలని అక్కడికి ఏ వాహనం పోదు రాదు ఇదేమిటని విద్యార్థి సంఘాలు అడిగితె వారిమీద కేసులు తో బెదిరింపులు . గత సంవత్సరాలనుండి నుండి ఇప్పటిదాకా ఎన్నోసార్లు అధికారులు నాయకులు వస్తుంటారని వారంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఇప్పటికి 7 సంవత్సరాలనుండి ఉచిత హామీలకే పరిమితం అయినది అందుకే ఒక వారంలోపు రోడ్డు వేయకుంటే వచ్చే వారంలో తహసిల్దార్ కలెక్టర్ ఆఫీసుల ముందు వందలాది మంది విద్యార్థులతో దీక్ష చేస్తామని హెచ్చరించారు ఈకార్యక్రమంలో రాయలసీమ విద్యార్ధి జిల్లా కార్యదర్శి రియాజ్ బాషా kj శ్రీనివాసరావు.

About Author