PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామస్థాయిలోనే స్పందన అర్జీల సమస్యలను పరిష్కరించాలి

1 min read

– స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలోని సచివాలయం -3, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల మరియు హెచ్ కైరవాడి గ్రామ సమీపంలోని హౌసింగ్ లేఔట్ ను ఎమ్మిగనూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్/ పథక సంచాలకులు(డిఆర్డీఏ-వైకెపి) యం వెంకట సుబ్బయ్య సందర్శించి పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నందు నాడు నేడు పనులలో భాగంగా కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం, ఇది వరకు ఉన్న భవనాల చిన్నపాటి మరమ్మతులను పరిశీలించారు.అనంతరం సచివాలయ-3 లో హాజరు శాతం,సర్వీస్ రిక్వెస్ట్ లు ప్రతి రోజు ఎన్ని వస్తున్నాయి అని సచివాలయ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అలాగే స్పందన ద్వారా వచ్చే అర్జీలు అర్జీ దారులకు సంతృప్తికరమైన సమాధానము ఇస్తూన్నార లేదా అని తెలుసుకొని సచివాలయ ఉద్యోగులకు తగిన సూచనలు సూచించారు. అనంతరం హెచ్ కైరవాడి హౌసింగ్ లేఔట్ నందు థర్డ్ పార్టీ వారి ద్వారా జరిగే ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ నీ ఆదేశించారు. క్షేత్ర సందర్శన అనంతరం ఎంపీడీవో కార్యాలయ సమావేశమందిరంలో సంబంధిత మండల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో సచివాలయ సిబ్బంది యొక్క హాజరు శాతం, జి ఎస్ డబ్ల్యు ఎస్ ఆక్టివిటీస్ మరియు ఎపి సేవ సర్వీసెస్ ను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని, స్పందన అర్జీలను నిశితంగా చదివి ప్రభుత్వ సూచనలను అనుసరించి ఆర్జిదారులకు సంతృప్తికరమైన సమాధానము ఇఛ్చి రి ఓపెన్ కాకుండా చూసుకోవాలని, గ్రామ సచివాలయ స్థాయిలో పరిష్కరింపబడే స్పందన ఫిర్యాదులను జిల్లా స్థాయిలో జరిగే స్పందన కు రాకుండ మీ దగ్గరే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. హౌసింగ్ లేఔట్ నందు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రాని లబ్ధిదారులకు చివరి అవకాశం కింద తహసీల్దార్ గారి సహకారంతో నోటీస్ ఇవ్వాలని, ఆసక్తి చూపించే లబ్ధిదారులకు నిబంధనలకు లోబడి మంజూరు చేయవలెనని హౌసింగ్ సిబ్బందికి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో బాబు భాస్కర్, మండల విద్యాధికారి శ్రీ వినోద్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్, ఏఈ హౌసింగ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ, ఎపియం, పంచాయతీ సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author