NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల రక్షణ… అందరి బాధ్యత

1 min read
కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

ఆళ్లగడ్డ రూరల్​ సీఐ రాజశేఖర్​ రెడ్డి
పల్లెవెలుగు, చాగలమర్రి;
మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని ఆళ్ళగడ్డ రూరల్‌ సిఐ రాజశేఖరరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఎస్‌ఐ మారుతి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుండి గాంధీ సెంటర్‌ వరకు కొవొత్తులతో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్సులు,అంగన్‌వాడి సిబ్బంది తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం గా ఏర్పడ్డారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ మహిళా సంరక్షణ కై ప్రభుత్వం దిశా లాంటి చట్టాలను అమలు చేస్తోందని, మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైన తమ దృష్టి కి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమం లో హమాలీల సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

About Author