విప్లవకారుడిని అరెస్టు చేసినట్టు హడావిడి చేస్తున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత కోసం ఓ వ్యవస్థ మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ పిల్లల జీవితాలలో ఆడుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఓ విప్లవకారుడిని అరెస్టు చేసినట్లు హడావిడి చేస్తున్నారని.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టాలా? అని సజ్జల ప్రశ్నించారు.