ఫ్యామిలీ డాక్టర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
1 min read-వైయస్సార్ విలేజ్ క్లీనిక్ 104 ద్వారా వైద్య సేవలు- డాక్టర్ వంశీకృష్ణ
పల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో భాగంగా ప్రభుత్వం , గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిట కె వైద్య సేవలు విస్తరించి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతున్నదని డాక్టర్ వంశీకృష్ణ అన్నారు, శనివారం ఆయన నేతృత్వంలో చెన్నూరు సచివాలయం-3 పరిధిలోని కొత్త గాంధీనగర్ నందు గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో, వైద్య సేవలు ప్రారంభించారు, ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో 8 సెంటర్లుగా విభజించి ప్రతి సెంటర్ కు ఆయా సచివాలయాల పరిధిలో నెలకు రెండు సార్లు నిర్దేశించబడిన రోజులలో అక్కడి ప్రజలకు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి రోగులకు తగిన మందులు అందించబడతాయి అని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకుని ఇంటి వద్ద బెడ్ మీద ఉన్న రోగులకు అవసరమైతే అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రజలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని వారు తెలియజేశారు, అనంతరం చెన్నూరు కొత్తగాంధీ నగర్ ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్యపరక్షలు నిర్వహించిన మందులు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమన, డిఇఓ సుమ, ఎం ఎల్ హెచ్ పి దివిజ, ఏఎన్ఎంలు, కళావతి, వనజ, పైలట్ సుబ్బారెడ్డి, ఎం పి హెచ్ రమణ, ఆశా వర్కర్లు, రజిని, శాంతి, అయవారమ్మ ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.